వనప్రవేశం చేసిన వనదేవతలు

మేడారం: మేడారం జాతర దిగ్విజయంగా ముగిసింది. వనదేవతలు భక్తుల శరణు మధ్య వనప్రవేశం చేశారు. అంతకు ముందు గద్దెల వద్ద గిరిజన పూజారులు సంప్రదాయ పూజలు నిర్వహించారు. పూజల అనంతరం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల వనప్రవేశం జరిగింది. డోలు వాయిద్యాలు, డప్పు చప్పుళ్లు నడుమ సమ్మక్క, సారలమ్మలు సంప్రదాయ నృత్యాల  మధ్య వనప్రవేశం చేశారు. వనదేవతల వనప్రవేశం వేడుకకు భక్తులు భారీగా తరలివచ్చారు. నాలుగు రోజుల పాటు మేడారం జాతర అంతరంగ వైభవంగా సాగింది. జాతర విజయవంతగా ముగిసిన సందర్భంగా దర్శనం సమయంలో సహకరించిన భక్తులకు, జాతర ఏర్పాట్లు చేసిన అన్ని శాఖల సిబ్బందికి, పోలీసులు శాఖకు జిల్లా కలెక్టర్‌ కృతజ్ఞతలు తెలిపారు.